నేడు విశాఖ రైల్వే మైదానంలో భాజపా ప్రజాచైతన్య సభ జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు.
- సాయంత్రం 6.20 గంటలకు విశాఖ విమాశ్రయానికి నరేంద్ర మోదీ చేరుకుంటారు.
- అనంతరం రోడ్డు మార్గం ద్వారా రైల్వే మైదానానికి వెళ్తారు.
- రాత్రి 7 గంటలకు బహిరంగ సభలో 45 నిమిషాల పాటు ప్రధాని ప్రసంగిస్తారు.
- మోదీ రాకకు ముందు సాయంత్రం 5 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి.