ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీవీఎంసీ పరిధిలో వ్యర్థ ప్లాస్టిక్‌ మిశ్రమంతో రోడ్లు - వ్యర్థ ప్లాస్టిక్ మిశ్రమంతో రోడ్లు

వ్యర్థ ప్లాస్టిక్ మిశ్రమాన్ని కలిపి రోడ్లు నిర్మాణం చేపడుతోంది జీవీఎంసీ. ప్రయోగాత్మకంగా రెండేళ్లక్రితం మూడు కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించారు. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో మరిన్ని రోడ్లు వ్యర్థ ప్లాస్టిక్‌ మిశ్రమాన్ని కలిపి వేసేందుకు రంగం సిద్ధంచేశారు.

plastic roads
plastic roads

By

Published : Oct 26, 2020, 5:16 PM IST

జీవీఎంసీ పరిధిలో ఇప్పటికే 16 రోడ్లను వ్యర్థ ప్లాస్టిక్‌ మిశ్రమాన్ని కలిపి వేశారు. వీటిలో కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా అరకిలోమీటరు నుంచి 3కి.మీ వరకు రెండేళ్లక్రితం నిర్మించారు. అప్పట్లో ఈ ప్రయోగానికి స్వచ్ఛసర్వేక్షన్‌ కేంద్ర పరిశీలన బృందాల నుంచి ప్రశంసలూ అందాయి. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో మరిన్ని రోడ్లను వ్యర్థ ప్లాస్టిక్‌ మిశ్రమాన్ని కలిపి వేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈసారి 8 జోన్లలోనూ ఒక్కో రోడ్డు ఉండేలా సుమారు 10.2 కి.మీ మేర వేయనున్నట్లు జీవీఎంసీ అధికారులు స్పష్టతనిచ్చారు.

వీటి కోసం సుమారు రూ.20 కోట్లవరకు వెచ్చించే అవకాశముందని తెలిపారు. రోడ్ల వెడల్పును బట్టి ఖర్చులో మార్పులొస్తాయని స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం ఎంవీపీకాలనీ సెక్టార్‌-5లో ఓ రోడ్డుతో ఈ పనులు మొదలుపెడుతున్నారు. జీవీఎంసీ వేసే రోడ్లలో తారు మిశ్రమంలో 8శాతం మాత్రమే ప్లాస్టిక్‌ వ్యర్థాల్ని కలపనున్నారు. గతంలో కాపులుప్పాడ డంపింగ్ ‌యార్డు నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాల్ని తీసుకోవాలని చూసినా.. అప్పట్లో (2017-18) ప్లాస్టిక్‌ వేరుచేసే ప్రక్రియ సరిగాలేక ఆ ప్రయత్నం చేయలేదు.

ఇతర వ్యర్థ ప్లాస్టిక్‌ నుంచి రోడ్లు వేశారు. ఇప్పుడు జీవీఎంసీ సేకరించే చెత్తలో వచ్చే వ్యర్థ ప్లాస్టిక్‌నే వినియోగించాలని చూస్తున్నారు. ఈ రోడ్లు వేసేందుకు అనువైన వాతావరణముండాలని.. లేకపోతే వేయలేమని జీవీఎంసీ ఇంజినీర్లు చెబుతున్నారు. ఎక్కువ ఎండ ఉండి వర్షాలుపడని పరిస్ధితుల్లోనే వేస్తామని స్పష్టతనిస్తున్నారు. స్వచ్ఛసర్వేక్షన్‌ - 2021లో ఘనవ్యర్థాల నిర్వాహణపరంగా ఈ రహదారులు కీలకంగా మారనున్నాయని సీఈ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు.

ఇదీ చదవండి:వైరల్​ కంటెంట్ నియంత్రణకు ఫేస్​బుక్ కీలక నిర్ణయం!

ABOUT THE AUTHOR

...view details