ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ మన్యంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం.. లబ్ధిదారుల ఆందోళన

పీడీఎస్‌ బియ్యంలో ప్లాస్టిక్‌ బియ్యం ఉన్నాయంటూ ఎం.మాకవరం గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డోర్‌ డెలివరీ, అంగన్‌వాడీ కేంద్రం ద్వారా గ్రామంలోని కొంతమందికి ఇటీవల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఇందులో కొన్ని బియ్యం గింజలు తేడాగా కన్పించాయి. విషయాన్ని స్థానికులు పంచాయతీ పెద్దలకు తెలిపారు. నిప్పులలో ఈ కల్తీ బియ్యం వేయగా ప్లాస్టిక్‌ వాసన వస్తోందని గ్రామస్థులు తెలిపారు.

plastic rice in pds vishakha district
plastic rice in pds vishakha district

By

Published : Jul 10, 2021, 1:35 PM IST

విశాఖ జిల్లా కొయ్యూరు మండ‌లంలోని ఎం.మాకవరం జీసీసీ డిపో నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేసిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉండ‌టంపై లబ్ధిదారులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం పంపిణీ చేసిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉండ‌టాన్ని వారు గుర్తించారు. పంపిణీ అనంతరం ఇంటికి తీసుకెళ్లి వండుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న స‌మ‌యంలో బియ్యం శుభ్రం చేస్తుండ‌గా ప్లాస్టిక్ బియ్యం క‌నిపించాయని స్థానికులు చెబుతున్నారు. ఇవి విర‌ప‌డానికి ప్ర‌య‌త్నిస్తే విర‌గ‌లేద‌ని, నీటిలో నాన బెడితే సాగుతున్నాయ‌ని ప‌లువురు ఆరోపించారు.

ఈ విషయమై... జీసీసీ డిపో ఎదుట ఆందోళన చేపట్టారు. భాజపా రాష్ట్ర గిరిజ‌న మోర్చా కార్య‌ద‌ర్శి లోకుల‌ గాంధీ తన బృందంతో గ్రామానికి స్థానికులతో మాట్లాడారు. భాధ్యులపై కఠిన చర్యులు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై స్థానిక తహసీల్దార్‌ తిరుమలరావుని ఫోనులో సంప్రదించగా అంగన్‌వాడీ ద్వారా ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ఇవి కొంచెం తేడాగా ఉంటున్నాయని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details