Four School Students Injured : అధికారుల నిర్లక్ష్యమో, కాంట్రాక్టర్ల కాసుల కక్కుర్తోగాని తూతూ మంత్రంగా పాఠశాల భవనం మరమ్మతులు నిర్వహించారు. మరమ్మతులు చేపట్టిన నెలల వ్యవధిలోనే పెచ్చూలుడి ప్రమాదానికి దారి తీశాయి. విశాఖ జిల్లా పద్మనాభం పంచాయతీ పరిధిలోని అర్చకునిపాలెం ప్రాథమిక పాఠశాలలో స్లాబ్ పెచ్చులూడి పడటంతో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. నాడు నేడులో భాగంగా ఇటీవల మరమ్మతులు చేసిన తరగతి గదిలోని స్లాబు నుంచే పెచ్చులూడి పడ్డాయి. ఈ ప్రమాదంలో తాలాడ వేదశ్రీ అనే ఒకటో తరగతి విద్యార్థి తలకు తీవ్ర గాయడం కావడంతో.. విజయనగరం మహారాజా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. నాణ్యత లోపం, పనుల్లో కాంట్రాక్టర్ల కాసుల కక్కుర్తి వల్లే ఈ ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
విశాఖలోని పాఠశాలలో ప్రమాదం.. నలుగురు విద్యార్థులకు గాయాలు
School Building Slab ceiling : విశాఖలో పాఠశాలలో ప్రమాదం జరిగింది. పాఠశాల భవనం పై పెచ్చులూడి నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో ఓ విద్యార్థిని తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పాఠశాలలో ప్రమాదం
Last Updated : Feb 8, 2023, 10:17 AM IST