ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ కేజీహెచ్​లో ప్లాస్మా ఫెరసిస్ యూనిట్​ ప్రారంభం

విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రిలో ప్లాస్మా ఫెరసిస్ యూనిట్​ను జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ప్రారంభించారు. కొవిడ్ బాధితులకు ప్రభుత్వాసుపత్రుల్లోనూ ప్లాస్మాను అందించే ఏర్పాట్లు చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు.

plasma feresis unit has been inaugrated in king george hospital at vishaka
విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రిలో ప్లాస్మా ఫెరసిస్ యూనిట్​ ప్రారంభం

By

Published : Oct 2, 2020, 3:40 PM IST

విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రిలో ప్లాస్మా ఫెరసిస్ యూనిట్​ను జిల్లా పాలనాధికారి వినయ్ చంద్ ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు రెడ్​ క్రాస్​తో కలిసి ప్లాస్మా అందుబాటులో ఉంచుతున్న వైద్యాధికారులు... ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో ప్లాస్మాను అందించే ఏర్పాట్లు చేశారు. కొవిడ్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు రావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్లాస్మా దాతలకు ప్రోత్సాహకంగా రూ.5 వేలు అందిస్తున్నట్లు కేజీహెచ్ పర్యవేక్షణాధికారి డాక్టర్ సుధాకర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details