చెరకు సాగు చేసే రైతులకు చెరకు అభివృద్ధి మండలి (సీడీసీ) ద్వారా 30 శాతం రాయతీపై క్రిమి సంహారక మందుల సరఫరా చేస్తున్నారు. మందులతో పాటు సాగునీటిని పొలాలకు పారించేందుకు వినియోగించే మడత పైపులను రాయితీపై అందిస్తున్నట్లు మండలి కార్యాలయ వర్గాలు తెలిపాయి. విశాఖ జిల్లా చోడవరం గోవాడ చక్కెర కర్మాగారానికి అనుబంధంగా నడిచే ఈ మండలి ఏటా రూ.40లక్షలతో వార్షిక బడ్జెట్ను రూపొందిస్తోంది. ఈ నిధులతో చెరకు సాగుకు అవసరమయ్యే సస్యరక్షణ మందులు, పరికరాలను చక్కెర కర్మాగారం సభ్యులైన, చెరకు రైతులకు అందిస్తారు.
చెరకు రైతులకు రాయితీపై సస్యరక్షణ పరికరాలు అందజేత - govada sugarcane factory latest news update
విశాఖ జిల్లా చోడవరం గోవాడ చక్కెర కర్మాగారానికి అనుబంధంగా నడిచే చెరకు అభివృద్ధి మండలి (సీడీసీ) చెరకు రైతులకు రాయితీపై క్రిమి సంహారక మందులు, పరికరాలను అందిస్తోంది. ఇందుకోసం వార్షిక బడ్జెట్ రూపోందించి ఆయా నిధుల ద్వారా రైతులకు సస్యరక్షణ మందులు, పరికరాలు రాయితీపై ఇస్తున్నారు.

చెరకు రైతులకు రాయితీపై సస్యరక్షణ పరికరాలు అందజేత