మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా ఏర్పాటు చేసే కసరత్తు తుదిదశకు చేరుకుంది. విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం, పాయకరావుపేట, నక్కపల్లి పంచాయతీలను అప్గ్రేడ్ చేసి నగర పంచాయతీలుగా మార్చే౦దుకు.. సంబంధిత అధికారులు గత ఏడాది డిసె౦బర్ 13న గ్రామసభలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఇటీవల తాజా ఉత్వరుల ప్రకారం పాయకరావుపేట, నక్కపల్లిని నగర పంచాయతీలుగా మారుస్తున్నట్టు పేర్కొన్నారు.
పాయకరావుపేటలో 2011 జనాభా లెక్కల ప్రకారం 35 వేల మంది ఉన్నారు. దీనిని మున్సిపాలిటీగా చేయాలంటే 40 వేలు జనాభా ఉండాలి. సమీప గ్రామాలైన అరట్లకోట, పీ.ఎల్ పురాన్ని విలీనం చేసినా జనాభా సరిపోకపోవడంతో అధికారులు మున్సిపాలిటీ ప్రతిపాదనను విరమించుకున్నారు. నగర పంచాయతీగా చేసి భవిష్యత్లో మున్సిపాలిటీగా చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.