విశాఖ మన్యం పాడేరు మండలం కుమ్మరి తోము అనే గ్రామంలోని మూడు కుటుంబాల్లో ముగ్గురు బాలికలు అంగవైకల్యంతో ఉన్నారు. కిల్లో భీమన్న, లక్ష్మీ దంపతులకు 11 ఏళ్ల మాధురి అనే అమ్మాయి ఉంది. పుట్టుకతోనే ఆమెకు అంగవైకల్యం. ఓ మనిషి పక్కనుంటేనే పని చేసుకోవడం సాధ్యం. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా సద రమ్ అంగవైకల్య ధ్రువీకరణ పత్రం పొందలేకపోయారు. దీంతో బాలికకు పింఛన్ పొందలేని పరిస్థితి.
కిల్లో భీమన్న సోదరుడు కళ్యాణ్ రాజు అతని కుమార్తె లావణ్య కూడా అంగవైకల్యమే. పుట్టినప్పుడు సరిగానే ఉంది. రెండేళ్ల వయసులో ఆకస్మికంగా ఫిట్స్ వచ్చింది. మాట కూడా పడిపోయింది. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా.. ఫలితం లేదు. ప్రతిరోజు మూడు నాలుగు సార్లు పడిపోతుందని చాలాసార్లు గాయాలపాలు అయిందని ఆమె తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. సదరమ్ సర్టిఫికెట్ పొందారు. పింఛన్ ఇవ్వాలంటూ అధికారులకు అందజేసినా ఫలితం మాత్రం శూన్యం. పింఛన్ మంజూరు చేయాలని వారు కోరుతున్నారు.