విశాఖలో నిరసన చేపట్టిన ఫొటోగ్రాఫర్లు - vishakapatnam photographers news
కరోనా లాక్డౌన్ కారణంగా వ్యాపార రంగాలు ఆర్థికంగా కుదేలయ్యాయి. సుమారు మూడు నెలల నుంచి ఉపాధి లేక ఫొటోగ్రాఫర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖలో తమను ఆదుకోవాలని కోరుతూ పొటోగ్రాఫర్లు నిరసన ప్రదర్శన చేపట్టారు.
![విశాఖలో నిరసన చేపట్టిన ఫొటోగ్రాఫర్లు విశాఖలో నిరసన చేపట్టిన ఫోటోగ్రాఫర్లు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7815668-826-7815668-1593421418868.jpg)
విశాఖలో నిరసన చేపట్టిన ఫోటోగ్రాఫర్లు
కరోనా కారణంగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న తమను ఆదుకోవాలని విశాఖ మధురవాడలో ఫొటోగ్రాఫర్లు నిరసన వ్యక్తం చేశారు. ప్రతి ఫొటో గ్రాఫర్ తమ దుకాణం మూసివేసి నిరసన తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం సంబంధిత నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరారు.