ఎల్జీ పాలిమర్స్ ఘటన మరవముందే విశాఖలో వరుసగా ఫార్మా కంపెనీలలో అగ్ని ప్రమాదాలు జరగడం అక్కడి ప్రజలను కలవరపాటుకు గురి చేస్తోంది. మొన్నటికి మొన్న సైనార్ ఫార్మా పరిశ్రమలో బెంజిన్ లీకవడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. తాజాగా విశాఖలోని అచ్యుతాపురం సెజ్‌లో విజయశ్రీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. పేలుడు దాటికి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో అందులో పనిచేస్తున్న కార్మికులు భయంతో పరుగులు తీశారు. పేలుడు దాటికి రెండు ద్విచక్ర వాహనాలు దగ్ధం కాగా.. సమీపంలోనే అగ్ని మాపక యంత్రం ఉండటంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
విశాఖలో మరో పేలుడు... తప్పిన పెను ప్రమాదం - fire accident latest news vishakapatnam
విశాఖలోని అచ్యుతాపురం సెజ్‌లో విజయశ్రీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. పేలుడు దాటికి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. భయంతో కార్మికులు పరుగులు తీశారు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
విశాఖలో మరో పేలుడు... తప్పిన పెను ప్రమాదం