పెట్రోల్, డీజిల్ విక్రయాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. దేశంలో గడచిన 20 రోజులుగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో విశాఖ ఇసుకతోట బస్టాప్ వద్ద ఆటో కార్మికులు నిరసన తెలిపారు.
పెట్రోల్, డీజిల్ అమ్మకాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి - పెట్రోల్, డీజిల్ అమ్మకాలు జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి
పెట్రోల్, డీజిల్ విక్రయాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని... ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. దేశంలో గడచిన 20 రోజులుగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో విశాఖ ఇసుకతోట బస్టాప్ వద్ద ఆటో కార్మికులు నిరసన తెలిపారు.
పెట్రోల్, డీజిల్ అమ్మకాలు జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి
విలువ ఆధారిత పన్నును పెట్రో ఉత్పత్తులపై రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వామన మూర్తి కోరారు. లాక్ డౌన్ కాలంలో ఆటో కార్మికులు ఉపాధిని కోల్పోయి అప్పుల పాలయ్యారని, ప్రస్తుతం కేంద్రం పెట్రోల్ ధరలు పెంచడం వల్ల ఆదాయం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: అంతర్జాతీయ మద్య నిషేధ దినోత్సవ ర్యాలీ