ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'విశాఖ స్టీల్​ ప్రైవేటుపరం కాకుండా పోరాడండి'

By

Published : Oct 3, 2020, 10:14 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్​ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని స్టీల్ టీఎన్​టీయూసీ యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ యత్నాన్ని అడ్డుకోవాలని కోరుతూ అనకాపల్లి ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతికి వినతి పత్రం అందజేశారు.

విశాఖ స్టీల్​ ప్రైవేటీకరణ కాకుండా పోరాడాలని ఎంపీ సత్యవతికి వినతిపత్రం
విశాఖ స్టీల్​ ప్రైవేటీకరణ కాకుండా పోరాడాలని ఎంపీ సత్యవతికి వినతిపత్రం

విశాఖ స్టీల్ ప్లాంట్​ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని ఆందోళన వ్యక్తం చేసిన టీయన్​టీయూసీ యూనియన్ సభ్యులు.. ప్రైవేటీకరణను అడ్డుకోవాలని అనకాపల్లి ఎంపీ సత్యవతికి వినతి పత్రం అందజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ స్థాపించి నేటికి 4 దశాబ్దాల అయినప్పటికీ.. ఇప్పటికీ నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని యూనియన్ అధ్యక్షుడు నమ్మి సింహాద్రి మండిపడ్డారు.

కొరియాకు అమ్ముకునేందుకు..

ఇప్పుడు కొరియా దేశానికి చెందిన పోస్కో కంపెనీకి విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పగించి ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పార్లమెంటులో మాట్లాడి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా చూడాలని ఎంపీకి విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:

తెలంగాణ హైకోర్టు: ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల్లో రోజువారీ విచారణ

ABOUT THE AUTHOR

...view details