ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం విషయంలో గొడవ.. అనకాపల్లిలో వ్యక్తి హత్య - విశాఖ జిల్లా నేర వార్తలు

మద్యం విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఒక వ్యక్తి హత్యకు దారితీసింది. ఈ ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది.

person murdered in anakapalli vizag district
అనకాపల్లిలో వ్యక్తి హత్య

By

Published : Aug 9, 2020, 8:01 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో మద్యం విషయంలో జరిగిన వివాదం వ్యక్తి హత్యకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి శారదా నది ఒడ్డున ఉన్న శ్మశాన వాటికలో కోమటి నూకరాజు అనే వ్యక్తి కాపరిగా పని చేస్తున్నాడు. అతనికి, గవరపాలెంకు చెందిన మద్దాల పరమేష్ అనే వ్యక్తికి మద్యం విషయంలో గొడవ జరిగింది.

ఇది మనసులో పెట్టుకున్న పరమేష్.. నూకరాజుని రాయితో కొట్టి హత్యచేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ABOUT THE AUTHOR

...view details