విశాఖ జిల్లా నక్కపల్లి మండలం గొడిచెర్ల జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. తుని వైపు వెళుతున్న వ్యాన్ అదుపు తప్పి ముందున్న సిమెంట్ లారీని ఢీకొట్టింది. దాంతో వ్యాన్ డ్రైవర్ క్యాబిన్లో చిక్కుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని పోలీసులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.
లారీని ఢీ కొట్టిన వ్యాన్.. ఒకరికి తీవ్ర గాయాలు - Accidents on Godicherla National Highway
గొడి చెర్ల జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి తుని వైపు వెళుతున్న వ్యాన్ అదుపు తప్పింది. డివైడర్ను దాటి వచ్చి సిమెంట్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.
![లారీని ఢీ కొట్టిన వ్యాన్.. ఒకరికి తీవ్ర గాయాలు లారీని ఢీ కొట్టిన వ్యాన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9715544-1007-9715544-1606735535159.jpg)
లారీని ఢీ కొట్టిన వ్యాన్
Last Updated : Nov 30, 2020, 6:02 PM IST