విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మామిడి పాలెంకు చెందిన గొల్లవిల్లి శివ అనే వ్యక్తి.. బయ్యవరం జాతీయ రహదారి వద్ద డివైడర్ను ఢీకొని మృతి చెందాడు. స్థానిక వెల్డింగ్ దుకాణంలో అతడు విధులు ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. రాత్రి సమయంలో ద్విచక్రవాహనంపై వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. అతనికి నాలుగు నెలల పాప ఉంది.
డివైడర్ను ఢీకొట్టిన వాహనం: వ్యక్తి మృతి - visakha road accidents
రోడ్డెక్కితే తిరికి క్షేమంగా ఇంటికి చేరతామనే నమ్మకం లేకుండా పోతోంది. ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా.. రోజూ ఎక్కడో చోట ప్రమాదాలను చూస్తూనే ఉన్నాం. విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన శివ అనే వ్యక్తిని.. డివైడర్ రూపంలో మృత్యువు కబళించింది. తనపై ఆధారపడిన కుటుంబానికి తీరని దుఖాన్ని మిగిల్చింది.
రోడ్డు ప్రమాదం
తమ బాధ్యత నెత్తికెత్తుకున్న శివ అకాల మరణంతో.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై కశింపేట ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు.