ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జల్లిపల్లి మత్స్యగెడ్డలో తేలిన వ్యక్తి మృతదేహం - పాడేరు గడ్డలో వ్యక్తి మృతదేహం లభ్యం

విశాఖ మన్యం జల్లిపల్లి మత్స్యగెడ్డలో వ్యక్తి మృతదేహం తేలుతూ వచ్చింది. మృతుడ్ని మెరకచింతకు చెందిన లక్ష్మయ్యగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

person dead body in jallipalli matsya gedda paderu vizag district
జల్లిపల్లి మత్స్యగెడ్డలో తేలిన వ్యక్తి మృతదేహం

By

Published : Apr 21, 2020, 3:15 PM IST

విశాఖ మన్యం పాడేరు- పెదబయలు మండలాల సరిహద్దు ప్రాంతమైన జల్లిపల్లి మత్స్యగెడ్డలో మృతదేహం లభ్యమైంది. చెక్క రాయి గ్రామస్థులు స్నానం చేయడానికి వచ్చి మృతదేహం తేలి ఉండడం చూసి.. పోలీసులకు సమాచారం అందించారు. పాడేరు ఎస్ఐ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతుడ్ని మెరకచింతకు చెందిన సోమేలి లక్ష్మయ్యగా గుర్తించారు. 2 రోజుల నుంచి అతను కనిపించడంలేదని బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణ ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details