ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య - man drank worm medicine committed suicide news

విశాఖ జిల్లా అనకాపల్లిలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక లావాదేవీల్లో వేధింపులే ఇందుకు కారణమని మృతుడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

person who cannot tolerate financial harassment commits suicide
ఫైనాన్స్​ వేధింపులు: పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

By

Published : Nov 26, 2020, 2:08 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన నూకేశ్వరరావు.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతను పట్టణానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి నాగేంద్ర దగ్గర పని చేసేవాడు. ఈ క్రమంలో.. యజమాని నాగేంద్రకు అతనికి మధ్య డబ్బుల విషయంలో వివాదం తలెత్తింది. నూకేశ్వరరావు తమను మోసగించాడని చెప్పగా.. కుటుంబీకులు 44 వేల రూపాయలు చెల్లించారు. కానీ.. తనను రూ.5 లక్షల పాటు మోసగించాడని నాగేంద్ర ఆరోపించాడు.

నాగేంద్రతో పాటు.. అనుచరులు శివ, శ్రీనివాసులు, జగన్నాథరావు.. డబ్బుల కోసం నూకేశ్వరరావును వేధించారు. ఈ విషయంపై.. అతని కుమారుడు ఉదయ్ కుమార్.. పోలీసులను ఆశ్రయించాడు. అంతలోనే.. నూకేశ్వరరావు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ భాస్కరరావు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details