ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రాణాల మీదకు తెచ్చిన చరవాణి వివాదం.. బ్లేడుతో యువకుడిపై దాడి - attack on a youth in anakapalli news

చరవాణి విషయంలో జరిగిన వివాదం యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. బ్లేడుతో ప్రత్యర్థి దాడి చేసిన ఘటనలో.. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది.

person attack with blade on youth in anakapalli vizag district
గాయపడిన యువకుడు

By

Published : Sep 27, 2020, 10:15 PM IST

చరవాణి విషయంలో జరిగిన వివాదం యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన కొణతాల మధు అనే యువకుడికి, లావరాజు అలియాస్ లోవ అనే వ్యక్తికి సెల్​ఫోన్ విషయమై ఘర్షణ తలెత్తింది.

ఈ క్రమంలో మధుపై లోవ బ్లేడుతో దాడిచేశాడు. మధు గొంతు భాగంలో గాయమైంది. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై ఈశ్వరరావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details