రాష్ట్ర వ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా విశాఖ ఏజెన్సీ కేంద్రం పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న దుర్గ ఆలయంలో తెల్లవారుజాము నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారే సమయంలో వచ్చే పొగమంచును కూడా లెక్కచేయకుండా బారులు తీరారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
పాడేరు దుర్గ ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ - తాజాగా పాడేరులో దసరా ఉత్సవం
పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న దుర్గ ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ ఉంది. మంచు గాలులను కూడా లెక్క చేయకుండా భక్తులు గుడిలో బారులు తీరారు.
పాడేరు దుర్గ ఆలయం లో భక్తుల తాకిడీ