విశాఖ జిల్లా ఆనందపురం మండలం దుక్కవానిపాలెంలో భూసేకరణకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కనీసం గ్రామసభలు నిర్వహించకుండా తమ భూమిని అధికారులు లాక్కుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు ఇవేమీ తమకు పట్టనట్టు ప్రభుత్వ ఆదేశాలు ప్రకారమే పనులు నిర్వహిస్తున్నామంటూ ముందుకు సాగుతున్నారు.
ఇళ్ల స్థలాల కోసం రైతుల సాగు భూమి చదును - విశాఖ జిల్లా తాజా వార్తలు
35 సంవత్సరాల నుంచి అక్కడి రైతులకు ఆ భూమే ఆధారం. ఆ నేలలో పండ్ల తోటలు సాగు చేసుకుంటూ వారు జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం ఆ భూమిని లాగేసుకుంటోంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా సాగు భూమిని చదును చేసిందని రైతులు ఆరోపిస్తున్నారు.
land pooling in vishaka
గ్రామంలో 21 సర్వేనెంబర్లో సుమారు ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిలో గత 35 సంవత్సరాల నుంచి స్థానిక రైతులు పండ్ల తోటలు వేసుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఈ భూమిని ప్రభుత్వం లాక్కుంటే తమ జీవనోపాధి ఎలా అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. పనులను ఆపాలని తాము కోరుతుంటే.... తహసీల్దార్ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని రైతులు వాపోతున్నారు.