ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీతాలు రాలేదుమహాప్రభో..! - జీతాలు అందక పింఛనుదారుల అవస్థలు

జూన్ నెల వేతనాల కోసం పింఛనుదారులు, ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం లభించి నాలుగు రోజులవుతున్నా సాంకేతిక కారణాల వల్ల విడుదల కాలేదు. బుధవారం సాయంత్రానికి జమవుతాయని ఖజానా శాఖ అధికారులు చెబుతున్నా.. ఆ పరిస్థితి లేదని, ఇంకా ఒకటి రెండు రోజులు పట్టే అవకాశం ఉందంటున్నారు.

people waiting for salary
people waiting for salary

By

Published : Jul 8, 2020, 9:58 AM IST

విశాఖ జిల్లాలోని 25 వేల మంది పింఛనుదారులు, 50 వేలమంది ఉద్యోగులు జూన్‌ నెల వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు, పింఛన్లు బ్యాంకు ఖాతాలకు జమవుతాయి. ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం లభించి నాలుగు రోజులవుతున్నా సాంకేతిక కారణాల వల్ల విడుదల కాలేదు. బుధవారం సాయంత్రానికి జమవుతాయని ఖజానా శాఖ అధికారులు చెబుతున్నా.. ఆ పరిస్థితి లేదని, ఇంకా ఒకటి రెండు రోజులు పట్టే అవకాశం ఉందంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details