ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ధరలు నియంత్రించండి.. పేదల సమస్య పరిష్కరించండి' - అనకాపల్లి తాజా వార్తలు

పెరుగుతున్న ధరలను ప్రభుత్వం నియంత్రించాలంటూ అనకాపల్లిలోని ప్రజాసంఘాలు ఆర్డీవో కార్యాలయం వద్ద తమ నిరసన తెలిపాయి. అనంతరం ఆర్డీవో సీతారామారావుకు వినతిపత్రం ఇచ్చారు.

ఆర్డీవో సీతారామారావుకు వినతిపత్రం అందజేసిన ప్రజాసంఘాలు

By

Published : Oct 6, 2020, 5:59 PM IST

అనకాపల్లిలో ప్రజాసంఘాల నేతలు ఆర్డీవో సీతారామారావుకు వినతిపత్రం అందజేశారు. కూరగాయల, నిత్యావసరాల ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలంటూ ఆర్డీవో కార్యలయం వద్ద నిరసన తెలిపారు.

పెరుగుతున్న ధరలను ప్రభుత్వం నియంత్రించకపోవడం దారుణమన్నారు. లాక్​డౌన్​ అనంతరం వీటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని వాపోయారు. ధరలు నియంత్రించి పేదల సమస్య పరిష్కరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details