విశాఖ జిల్లా పాడేరు మన్యంలో చనిపోయిన గోవు మాంసాన్ని తిని.. అతిసారంతో 76 మంది ఆస్పత్రి పాలయ్యారు. జి.మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ మగతపాలెంలో సోమవారం ఓ ఆవు మృతి చెందింది. గ్రామంలో వారందరూ రెండు రోజులు పాటు నిల్వ ఉన్న గోమాంసం తిన్నారు. ఈ క్రమంలో 76 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో వీరిని జి.మాడుగుల ఆసుపత్రికి తరలించారు.
వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండడం వల్ల వారిని పాడేరు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.