"కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి" - నర్సీ పట్నం ఆర్డీఓ
లాక్డౌన్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని నర్సీపట్నం ఆర్డీవో లక్ష్మీజ్యోతి తెలిపారు. డివిజన్లో కరోనా వ్యాప్తి లేకున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
!["కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి" "People should be vigilant on Corona"](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6573236-31-6573236-1585389621117.jpg)
"కరోనా పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి"
"కరోనా పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి"
విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్లో నిత్యావసరాల పంపిణీకి ప్రతి మండల పరిధిలో రేషన్ డీలర్లను, వీఆర్వోలను అప్రమత్తం చేశామని ఆర్డీఓ లక్ష్మీ శివ జ్యోతి తెలిపారు. డివిజన్ పరిధిలో కరోనా విజృంభించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రధానంగా ఇతర ప్రాంతాల నుంచి డివిజన్లోకి వచ్చే వారి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. నర్సీపట్నం డివిజన్ లో కరోనా వ్యాప్తి అంతగా లేకపోయిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు.