కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో విశాఖ జిల్లా పాడేరు డిగ్రీ కళాశాల బాలుర వసతి గృహంలో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. చుట్టుపక్కల వారు ఆందోళన చేశారు. ఇళ్ల మధ్య క్వారంటైన్ సెంటర్ వద్దంటూ సుండ్రుపుట్టు, లోచలి పుట్టు గ్రామస్థులు నిరసన చేశారు.
బాలుర వసతి గృహంలో క్వారంటైన్ సెంటర్ వద్దంటూ ఆందోళన - visakha dst covid cases
విశాఖ జిల్లా పాడేరు డిగ్రీ కళాశాల బాలుర వసతి గృహంలో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయాలనుకున్న అధికారులు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేశారు. ఇళ్లమధ్యలో కొవిడ్ కేంద్రం వద్దంటూ నిరసన చేశారు. కళాశాలకు వెళ్లే దారిని మూయించారు.
people protest in viskaha dst about notcovid center
శానిటేషన్ సిబ్బందిని పంపించి వేశారు. వసతి గృహంలో అసలు సౌకర్యాలు లేవని, మరుగు మంచినీటి సదుపాయాలు లేకుండా ఎందుకు నిర్వహిస్తారని నిలదీశారు. వృథా నీరు చుట్టుపక్కల నిలిచిపోతుందని దీంతో కొవిడ్ మరింత వ్యాప్తి చెందుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు దీనిని విరమించుకోవాలని వేరే ప్రాంతానికి తరలించాలని స్థానికులు ఆందోళన చేశారు. డిగ్రీ కళాశాల రహదారి దిగ్బంధించి మూసివేశారు.
ఇదీ చూడండి