రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన యధేచ్ఛగా జరుగుతోందని ప్రజా సంఘాలు ఆరోపించాయి. విశాఖ జిల్లా అనకాపపల్లిలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్, ప్రజా సంఘాలు సమావేశమయ్యాయి. మానవ హక్కుల పరిరక్షణ కోసం మానవ హక్కుల కమిషన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత అక్టోబర్లో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించినా.. ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.
'మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలి' - human rights in ap
రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. విశాఖ జిల్లా అనకాపపల్లిలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్, ప్రజా సంఘాలు సమావేశమయ్యాయి. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన యధేచ్ఛగా జరుగుతోందని సంఘాల నేతలు ఆరోపించారు.
ప్రజాసంఘాల సమావేశం
పోలీసులు కొన్ని సందర్భాల్లో గిరిజనుల హక్కులను హరిస్తున్నారని.. వారిని కాపాడే కమిషన్ లేకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు.
ఇదీ చదవండి: తొలగింపు నుంచి..తిరిగి బాధ్యతలు చేపట్టేవరకు..!