45 ఏళ్లకు పైబడిన వారికి మెుదటి డోస్ టీకాలు వేసే కార్యక్రమానికి విశాఖ నగర పాలక సంస్థ చర్యలు చేపట్టింది. ఎంపిక చేసిన ఆరోగ్య కేంద్రాల్లో టీకా వేస్తున్నారు. కొవాగ్జిన్ రెండో డోస్ తీసుకునే వారికి కూడా ఏర్పాట్లు చేశారు. మెసేజ్ అందినవారు లేదా వ్యాక్సినేషన్ స్లిప్స్ అందినవారు టీకా కేంద్రాలను సంప్రదిస్తే టీకాలు వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
విశాఖలో కొవిడ్ టీకా కోసం బారులు తీరిన జనం - విశాఖలో కొవిడ్ టీకా కోసం బారులు తీరిన జనం
విశాఖలో కొవిడ్ టీకా పంపిణీ కొనసాగుతోంది. 45 ఏళ్లు పైబడిన వారికి ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేస్తున్నారు. రెండవ డోసు తీసుకునే వారు 20వేల మందికి పైగా ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
![విశాఖలో కొవిడ్ టీకా కోసం బారులు తీరిన జనం విశాఖలో కొవిడ్ టీకా కోసం బారులు తీరిన జనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11909606-1037-11909606-1622042666680.jpg)
విశాఖలో కొవిడ్ టీకా కోసం బారులు తీరిన జనం
టీకా తీసుకున్న తర్వాత 30 నిమిషాల పరిశీలనకు అన్ని ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో టీకా తీసుకోవడానికి వస్తున్నారని అధికారులు వెల్లడించారు. రెండవ డోస్ తీసుకునే వారు 20వేల మందికి పైగా ఉన్నారని అంచనా వేశారు.
ఇదీ చదవండి: