విశాఖలో సబ్సిడీ ఉల్లి పంపిణీలో గందరగోళం నెలకొంది. ఎంవీపీ రైతు బజార్ వద్ద ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఉల్లి కోసం వినియోగదారులు ఉదయం నుంచే బారులు తీరారు. జనం ఎక్కువగా రావడం వల్ల కొద్దిసేపు తోపులాట జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వినియోగదారులను నియంత్రించారు. కొద్దిసేపుపోలీసులు, వినియోగదారులు మధ్య వాగ్వాదం జరిగింది. క్యూలైన్లో నిల్చున్న కొంత మంది వృద్ధులు స్పృహ తప్పి పడిపోయారు. వీరికి పోలీసులు సపర్యలు చేశారు. క్యూలో ఉన్న వారందరికీ రాయితీ ఉల్లి ఇవ్వాలని వినియోగదారులు డిమాండ్ చేశారు.
విశాఖలో సబ్సిడీ ఉల్లి కోసం జనం పాట్లు - people fight for ration onion latest news
విశాఖలో ప్రభుత్వం చేపట్టిన సబ్సిడీ ఉల్లి పంపిణీలో గందరగోళం నెలకొంది. రాయితీ ఉల్లి కోసం రైతు బజార్ వద్ద పెద్ద సంఖ్యలో వినియోగదారులు బారులు తీరారు. తోపులాట జరగడం వల్ల పోలీసులు రంగ ప్రవేశం చేసి వినియోగదారులను నియంత్రించారు.
![విశాఖలో సబ్సిడీ ఉల్లి కోసం జనం పాట్లు people fight for ration onion in vishakapatnam mvp raithu bajar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5287293-286-5287293-1575618971877.jpg)
సబ్సిడీ ఉల్లి కోసం జనం పాట్లు