ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మన్యం వాసులకు తప్పని డోలీ కష్టాలు... రోడ్డు నిర్మించాలని ప్రజల విజ్ఞప్తి - manyam latest news

విశాఖ పాడేరు ఏజెన్సీలో డోలీ మోతలు ఆగటం లేదు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు యాతన తప్పటం లేదు. మన్యంలో కొండ రహదారులు అస్తవ్యస్తంగా ఉన్న కారణంగా... గర్భిణులు, రోగులను ఆస్పత్రికి తరలించేందుకు అగచాట్లు పడాల్సి వస్తోంది.

problems of manyam people
మన్యం వాసుల డోలీ కష్టాలు

By

Published : May 7, 2021, 6:55 PM IST

విశాఖ జిల్లా పాడేరులోని పలు ప్రాంతాలకు ఇప్పటికీ రహదారులు సరిగ్గా లేవు. మండలంలోని మోదాపల్లి పంచాయితీ గాలిపాడుకు చెందిన సీదరి రస్మో అనే గర్భిణీకి పురిటి నొప్పులు వచ్చాయి. 108 వాహనానికి సమాచారం అందించారు. రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడంతో మూడు కిలోమీటర్ల దూరంలో అంబులెన్స్ నిలిపివేశారు.

ఈ విపత్కర పరిస్థితిలో.. చేసేది లేక.. బంధువులు ఆమెను డోలీలో మోసుకుంటూ వెళ్లారు. కొండదారిలో రాళ్లు, రప్పలు దాటుకుంటూ.. అతి కష్టం మీద బాధితురాలిని 108వద్దకు చేర్చారు. రహదారి నిర్మాణం చేపట్టి తమ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details