ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నత్తనడకన వంతెన పనులు.. అవస్థలు పడుతున్న జనం - Construction of roads and bridges in visakha

విశాఖ జిల్లాలో రహదారుల నిర్మాణ పనులు నత్తనడకగా సాగుతున్నాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలను అనుసంధానం చేసే వంతెనల పనులు ముందుకు సాగడం లేదు.

Ongoing bridge works
కొనసాగుతున్న వంతెన పనులు

By

Published : Oct 30, 2020, 9:26 AM IST

విశాఖ జిల్లాలో రహదారులు, వంతెనల నిర్మాణ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలో శారదా నదిపై జరుగుతున్న వంతెనల పనులు ముందుకు సాగటం లేదు. దీంతో గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గవరవరం వద్ద 2011 - 12 మధ్య వంతెన కూలింది. దీంతో శారదా నదిపై ప్రజల రాకపోకల నిమిత్తం తాత్కాలికంగా కాజ్​వే ఏర్పాటు చేశారు. భారీ వర్షాలకు నది ఉద్ధృతంగా ప్రవహించినపుడు కాజ్​వే కొట్టుకుపోతోంది. 2017లో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టినప్పటికీ అది ఇంకా పూర్తి కాలేదు. పనులు వేగవంతంచేసి రాకపోకలు పునరుద్ధరించాలని చోడవరం, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల ప్రజలు కోరారు. 2021 మార్చి నాటికి వంతెన పనులు పూర్తివుతాయని రహదారులు, భవనాల శాఖ సహాయక ఇంజనీర్​ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details