ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సరైన ఆధారాలు లేకుంటే పింఛన్ కష్టమే! - Narsipatam latest news

రాష్ట్రంలో అర్హత ఉండి సరైన ఆధారాలు లేక పింఛన్ పొందలేని వారు అనేకమంది ఉన్నారు. అర్హత లేకున్నా ఆధారాలు సృష్టించి లబ్దిపొందుతున్న వారేందరో చెప్పలేం. ఇలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం కార్యచరణ ప్రారంభించింది. ఆధార్ కార్డులలో వయసు మార్పులు చేసుకున్న వారి వివరాలను ఇప్పటికే సచివాలయాలకు పంపించింది. గ్రామ వాలంటీర్లు ఆధారాలు సేకరించాలని ఆదేశించింది.

సరైన ఆధారాలు లేకుంటే పింఛన్ కష్టమే!
సరైన ఆధారాలు లేకుంటే పింఛన్ కష్టమే!

By

Published : Dec 1, 2020, 5:29 PM IST

సరైన ఆధారాలు లేకుంటే పింఛన్ కష్టమే!

పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో వివిధ రకాల పింఛన్లు అందజేస్తోంది. అందులో వృద్ధాప్య పింఛన్ కు 60 సంవత్సరాల అర్హతగా నిర్ణయించింది. ఇందుకు ఆధార్ కార్డులో వయసు ప్రామాణికంగా తీసుకుంటోంది. తప్పుడు వివరాలతో పింఛన్ పొందుతున్న వారి సంఖ్య వేలల్లో ఉంటుందని భావిస్తున్న ప్రభుత్వం ఈ విషయమై సమగ్ర విచారణ చేపట్టాలని నిర్ణయించింది. గడచిన మూడు నాలుగేళ్లలో ఆధార్ కార్డులో వయసు మార్పు చేయించుకుని తద్వారా పింఛన్ తీసుకుంటున్న వారి వివరాలను సచివాలయాలకు పంపించింది. పింఛన్​దారుల ఇంటికి వెళ్లి సమగ్ర పరిశీలన చేసి తగిన ఆధారాలు సేకరించే వలసిందిగా వాలంటీర్లను ఆదేశించింది.

సరైన ఆధారాలు లేకుంటే పింఛన్ కష్టమే!
ఇవీ చదవండి

దివ్యాంగుల కోసం ఎయిమ్స్ 'ఫ్లెక్స్‌మో యాక్సిలరీ క్రచెస్‌'

ABOUT THE AUTHOR

...view details