ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం వద్ద పింఛను పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి అయ్యన్న సతీమణి చింతకాయల పద్మావతి వృద్ధులు, పేదలకు చీరలు, పంచెలు అందజేశారు.
'పథకాలు వినియోగించుకోండి' - narsipatnam
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా చేస్తోన్న పింఛను పంపిణీ కార్యక్రమాన్ని విశాఖ జిల్లా నర్సీపట్నంలో మంత్రి అయ్యన్న చేపట్టారు.
!['పథకాలు వినియోగించుకోండి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2343741-69-23f5ca07-83a2-4a9a-83e2-d027e7befa25.png)
నర్సీపట్నం మినీ స్టేడియంలో పింఛన్ల పంపిణీ
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా అన్ని వర్గాల అభ్యున్నతికి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారు -మంత్రి అయ్యన్న
పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
Last Updated : Feb 4, 2019, 5:30 PM IST