సకాలంలో పింఛన్ అందక :
ఏయూలో విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేసిన వారికి సకాలంలో పింఛను అందకపోవటం పింఛన్దారులు ఆందోళన చెందుతున్నారు. నెలవారీ చెల్లింపులు, అద్దెలు వంటివి మొదటి వారంలో కట్టాల్సి రావడం కొంత ఇబ్బందులకు గురవుతున్నారు.ఇక పెన్షన్తీసుకునేవారిలో ఎక్కువ మంది ఆరోగ్య సమస్యల ఎదుర్కోవడం, మందుల వ్యయం కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంతో పింఛన్ఆలస్యం కావడం వీరంతా మరింత ఆందోళన చెందుతున్నారు.
విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో చెల్లింపులు జరిగినప్పుడు ఒకటి, రెండు తేదీల్లో పింఛన్ జమయ్యేది. ప్రస్తుతం దీపావళి పండుగ నాటికి కూడా డబ్బులు అందక తీవ్ర నిరాశలో గడపాల్సిన పరిస్థితి వచ్చిందని పలువురు చెబుతున్నారు. గతంలో ప్రభుత్వం ‘బ్లాక్ గ్రాంట్’ నిధులను విశ్వవిద్యాలయానికి మంజూరు చేస్తే.. ఆ మొత్తం నుంచి జీతాలు, పింఛన్లు చెల్లించేవారు. ఖజానా శాఖ పరిధిలోనికి పింఛన్ చెల్లింపులు వెళ్లిన తరువాత.. అధికారులు పింఛనర్ల వివరాలను వారికి పంపుతున్నారు. దీని కోసం ‘కాంప్రహెన్సివ్ ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్ సిస్టం’ను రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోంది. ఈ ప్రక్రియలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందుతున్నప్పటికీ.. పింఛన్ ఆలస్యమవుతుండటం గమనార్హం.