తొలగించిన పింఛన్లను తిరిగి ఇవ్వాలి.. - నర్సీపట్నంలో పింఛన్ లబ్ధిదారుల నిరసన
అక్రమంగా తొలగించిన పింఛన్లను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ .. విశాఖ జిల్లా నర్సీపట్నంలో పింఛన్ల లబ్ధిదారులు ధర్నా చేశారు. నర్సీపట్నం పురపాలక పరిధిలో పింఛన్లను కోల్పోయిన లబ్ధిదారులు ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని నినాదాలు చేశారు. ఆర్డీవోకి వినతిపత్రం అందించారు. సుమారు 750 పింఛన్లను తొలగించారని ఇందులో వికలాంగులు, వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు ఉన్నారని వారు తెలిపారు. తొలగింపు కారణాలపై విచారణ జరిపించి... సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు.
నర్సీపట్నంలోఆందోళన చేస్తున్న పింఛన్ లబ్ధిదారులు