ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వరూపానంద జన్మదిన వేడుకలకు శారదాపీఠం సన్నాహాలు - స్వరూపానంద జన్మదిన వేడుకలకు సిద్ధమవుతున్న పెందుర్తి శారదాపీఠం

శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడానికి పీఠం ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, వేదసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

swaroopananda birthday celebrations
పెందుర్తిలోని శారదా పీఠం

By

Published : Nov 17, 2020, 8:49 PM IST

విశాఖ పెందుర్తిలోని శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదిన వేడుకలు.. రేపు వైభవంగా నిర్వహించేందుకు పీఠం ప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నారు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని.. ఆంధ్ర, తెలంగాణల్లో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లో విద్వాంసులైన 200 మందికి పైగా వేదపండితులతో.. పెద్ద ఎత్తున వేదసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు ప్రముఖులు హాజరు కానుండగా.. పెందుర్తి సీఐ అశోక్ కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details