విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలంలోని పెద్దేరు జలాశయం వరద గేట్లను అధికారులు మూసివేశారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టి, ఎగువ ప్రాంతాల నుంచి వరద రాక తగ్గిపోవటంతో... ఆనకట్ట నుంచి నీటి విడుదలను నిలిపివేశారు. ప్రస్తుతం 280 క్యూసెక్కుల నీరు వస్తుండగా... జలాశయంలో 136.2 మీటర్ల నీటిమట్టం ఉంది. రాచకట్టు, ఆర్ఎంసీ సాగునీటి కాలువలకు మాత్రమే 30 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈ సుధాకర్ రెడ్డి తెలిపారు.
పెద్దేరు జలాశయం క్రస్ట్ గేట్లు మూసివేత
వర్షాలు తగ్గుముఖం పట్టడం వల్ల విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలంలోని పెద్దేరు జలాశయం గేట్లను అధికారులు మూసివేశారు. రాచకట్టు, ఆర్ఎంసీ కాలువలకు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు.
పెద్దేరు జలాశయం క్రస్ట్ గేట్లు మూసివేత