ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెద్దేరు జలాశయం నుంచి నీటి విడుదల

విశాఖ జిల్లాలోని పెద్దేరు జలాశయం నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటి మట్టం 137 మీటర్లు కాగా.. ప్రస్తుతం 136.65 మీటర్లకు చేరుకుంది. జలాశయం నుంచి రాచకట్టు కాలువకు సాగునీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.

By

Published : Dec 27, 2020, 4:59 PM IST

pedderu reservoir water release
పెద్దేరు జలాశయం నుంచి నీటి విడుదల

విశాఖ జిల్లా మాడుగుల మండలం పెద్దేరు జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ నుంచి జలాశయంలోకి అదనపు నీరు వస్తోంది. రైతుల విన్నపం మేరకు అధికారులు జలాశయం నుంచి రాచకట్టు కాలువకు 10 క్యూసెక్కుల మేర సాగునీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 137 మీటర్లు.

ప్రస్తుతం 136.65 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. ఈ కారణంగా.. సాగునీరు రబీ సాగుకు పుష్కలంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది రబీకి సాగునీటిని విడుదల చేశారు. ఆయకట్టు ప్రాంత రైతులు వరి, ఇతర ఆరుతడి పంటల సాగు దిశగా అడుగులు వేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details