విశాఖ జిల్లా పెద్దేరు జలాశయంలో నిండు కుండను తలపిస్తోంది. జలాశయంలో నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. ఇక సాగునీటికి బెంగ ఉండదని ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు జలాశయానికి భారీగా నీళ్లు రావటంతో కళకళలాడుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 137 మీటర్లు కాగా, ప్రస్తుతం 136.60 మీటర్లు ఉంది.
నిండు కుండలా పెద్దేరు జలాశయం - pedderu reserviour news in vishaka
ఇటీవలా కురిసిన భారీ వర్షాలకు విశాఖ జిల్లా మాడుగుల మండలం పెద్దేరు జలాశయం నీటితో కళకళలాడుతోంది. నీటితో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. రబీ సీజన్ కు సాగునీటికి ఇబ్బంది ఉండదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నిండు కుండలా పెద్దేరు... సాగునీటికి ఇక లేదు బెంగ
ఎగువ పరివాహక ప్రాంతం నుంచి ఇన్ ఫ్లో 170 క్యూసెక్కులు వస్తుంది. స్పిల్ వే గేట్ల నుంచి దిగువకు పెద్దేరు నదిలోకి 174 క్యూసెక్కుల వరదనీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు రాచకట్టు, ఆర్.ఎం.సీ కాలువలకు 90 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు జలాశయం ఏఈ సుధాకర్ రెడ్డి చెప్పారు. రబీ సీజన్ కు సాగునీటికి ఇబ్బంది ఉండదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: