ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోవా డ్రగ్ డీలర్ డిసౌజాపై పీడీ యాక్ట్.. చంచల్​గూడ జైలుకు తరలింపు

PD Act on Goa Drug Dealer Dsouza : గోవా మాదక ద్రవ్యాల కేసులో నిందితుడిగా ఉన్న డిసౌజాపై హైదరాబాద్ పోలీసులు పీడీ చట్టం ప్రయోగించారు. ఐదు రోజుల క్రితం డిసౌజాపై పీడీ చట్టం నమోదు చేసిన పోలీసులు.. తాజాగా అతడిని అరెస్ట్ చేసి చంచల్​గూడ జైలుకు రిమాండ్​కు పంపించారు.

Drug Dealer Dsouza
డ్రగ్ డీలర్ డిసౌజా

By

Published : Jan 14, 2023, 9:00 PM IST

PD Act on Goa Drug Dealer Dsouza : మాదకద్రవ్యాల సరఫరాపై ఉక్కుపాదం మోపిన తెలంగాణ పోలీసులు గోవా మాదక ద్రవ్యాల కేసులో ముగ్గురిపై పీడీ యాక్టు ప్రయోగించారు. బెయిల్ మీద విడుదలైన డిసౌజాపై పీడీ యాక్టు ప్రయోగించి అరెస్టు చేసి చంచల్​గూడ జైలుకు రిమాండ్​కు తరలించారు. గతేడాది ఆగస్టులో ఓయూ పోలీసులు గోవాకు చెందిన ప్రితీష్ నారాయణ్ బోర్కర్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. మాదక ద్రవ్యాలు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా బోర్కర్​ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతనిచ్చిన సమాచారం ప్రకారం గోవాకు చెందిన ఆరుగురిపై కేసు నమోదు చేశారు.

ఎడ్విన్ న్యూన్, డిసౌజాతో పాటు మరో ముగ్గురిపైనా కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 25వ తేదీన డిసౌజాను, నవంబర్ 5న ఎడ్విన్ న్యూన్​ను నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఇందులో డిసౌజాకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో చంచల్​గూడ జైలు నుంచి బయటికి వచ్చి గోవా వెళ్లిపోయాడు. ఎడ్విన్, బోర్కర్ మాత్రం రిమాండ్ ఖైదీలుగా జైల్లోనే ఉన్నారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నెల క్రితం ఎడ్విన్, బోర్కర్​పై పీడీ చట్టం ప్రయోగించారు. దీంతో ఏడాది పాటు ఇద్దరు నిందితులు జైల్లోనే గడపాల్సి ఉంటుంది.

డిసౌజా కోర్టు ఆదేశాల మేరకు ప్రతి వారం హైదరాబాద్ పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. ఆదివారం గోవా నుంచి హైదరాబాద్ వచ్చి పోలీసుల ఎదుట హాజరయ్యారు. అప్పటికే సీవీ ఆనంద్, డిసౌజాపైనా పీడీ చట్టం ప్రయోగించారు. దానికి సంబంధించిన పత్రాలను డిసౌజాకు ఇచ్చి వెంటనే అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details