ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉక్కు కర్మాగారంపై చేయి వేస్తే భాజపాకు భవిష్యత్ ఉండదు' - విశాఖ స్టీల్ ప్లాంట్​పై శైలజానాథ్ మీడియా సమావేశం

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీక‌ర‌ణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పీసీసీ చీఫ్ శైల‌జానాథ్ తెలిపారు. ప్లాంట్ కోసం పోరాటానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని.. జాతీయస్థాయిలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

sailajanath pressmeet on vizag steel plant
ఉక్కు కర్మాగారంపై చేయివేస్తే భాజపాకు భవిష్యత్ ఉండదు

By

Published : Feb 6, 2021, 3:57 PM IST

విశాఖ ఉక్కు కర్మాగారం మీద‌ చేయి వేస్తే భాజపాకు భవిష్యత్ ఉండదని పీసీసీ చీఫ్ శైలజానాధ్ వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. విశాఖ‌లోని పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర బ‌డ్జెట్​లో రైల్వే జోన్ ఊసే లేదని, ఉత్తరాంధ్ర ప్యాకేజీకి తావేలేకుండా చేశార‌ని మండిపడ్డారు. భాజపాతో ముఖ్యమంత్రి జగన్ కుమ్మక్కయ్యారని... అందుకే మౌనంగా ఉన్నారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్​ కోసం కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని శైల‌జానాథ్ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details