తూర్పుకోస్తా రైల్వేలో వాల్తేర్ డివిజన్... కరోనా వల్ల రద్దయిన రైళ్లకు సంబంధించి ప్రయాణికులకు భారీ మొత్తంలోనే నగదు వాపసు ఇచ్చింది. ప్రతి రోజూ విశాఖ నుంచి దాదాపు 150 నుంచి 180 రైళ్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. మార్చి నెలలో ఆరంభమైన లాక్ డౌన్, తర్వాత పూర్తిగా రైళ్ల రద్దుతో ప్రయాణాలన్నీ అగిపోయాయి. అన్లైన్లో టిక్కెట్ల రుసుమును వాపసు తీసుకునేందుకు అవకాశం ఇచ్చినా.. లాక్డౌన్ అనంతరం కౌంటర్లను తెరిచిన తర్వాతే నగదు రూపంలో సొమ్మును తీసుకున్నారు.
జూన్ ఒకటి నుంచి సొమ్ము రీఫండ్‌ను ప్రారంభించిన రైల్వే అధికారులు... రద్దయిన రైళ్ల ప్రయాణికులందరికి పూర్తిగా డబ్బును ఇచ్చారు. వాల్తేరు డివిజన్లోని విజయనగరం, శ్రీకాకుళం రోడ్, రాయగడ రైల్వే స్టేషన్లలోని రిజర్వేషన్ కేంద్రాలన్నింటిలోనూ దాదాపు రెండు కోట్ల రూపాయల మొత్తాన్ని తిరిగి చెల్లించారు.