Pawan Kalyan Varahi Yatra in Visakhapatnam: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి విశాఖలో వారాహి యాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ సాయంత్రం జగదాంబ సెంటర్లో బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. దీంతో జగదాంబ సెంటర్‌కు వెళ్లే దారుల్లో ట్రాఫిక్ మళ్లించారు. జగదాంబ సెంటర్ మీదుగా వన్ టౌన్ వెళ్లే బస్సులు, ఆటోలు అన్నీ దారి మళ్లించడంతో ఆ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం నుంచి వాహనాలను దారి మళ్లించడంతో జగదాంబ సెంటర్ మీదుగా కేజీహెచ్, వన్ టౌన్ వెళ్లే ప్రజలు రవాణా సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. సినీ హీరోగా, ఓ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్‌ను అభిమానులు ఎంతో ఇష్టపడుతుంటారు.
Pawan Varahi Vijaya Yatra: జనంలోకి జనసేనాని.. విశాఖలో ప్రారంభం కానున్న వారాహి యాత్ర మూడవ దశ
Pawan Fans Photos with Varahi: పవన్ కళ్యాణ్ నేటి నుంచి విశాఖలో వారాహి యాత్ర (Varahi Yatra) చేపడుతున్న విషయం తెలుసుకున్న అభిమానులు.. వారాహి వాహనాన్ని చూసేందుకు, వాహనంతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. వారాహి వాహనం ఎవరికీ కనబడకుండా జిల్లా పరిషత్ సమీపంలోని ఓ రోడ్డులో పార్కు చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు... వారాహి వాహనంతో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగడంతో ఈ ప్రాంతం పవన్ అభిమానులతో కిక్కిరిసిపోయింది. మగవారితో పాటు యువతులు, మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ గుమిగూడి వాహనంతో ఫొటోలు దిగారు. వారాహి వాహన భద్రత సిబ్బంది అభిమానులను అక్కడి నుంచి పంపేందుకు అవస్థలు పడ్డాయి. అభిమానులను బయటకు పంపి గేటుకు తాళం వేసినప్పటికీ వారిని అదుపు చేయడం భద్రతా సిబ్బంది వల్ల కాలేదు. చివరికి చేసేదేమీ లేక వారాహి వాహనంతో సెల్ఫీలు దిగేందుకు ఒకరి తర్వాత ఒకరిని అనుమతించారు.