రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నా: పవన్ - pawan with modi
విశాఖలో ప్రధాని మోదీని పవన్‌కల్యాణ్ కలిశారు. ప్రత్యేక పరిస్థితుల్లో తమ భేటీ జరిగిందన్న పవన్.. రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
Pawan Kalyan comments after PM Modi's Meet: విశాఖ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. మోదీతో నా సమావేశం ద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్ ఉంటుందని భావిస్తున్నానని తెలిపారు. రెండు రోజుల క్రితం పీఎంవో నుంచి కాల్ వచ్చిందని.. 8 ఏళ్ల తర్వాత మోదీని కలిశానని అన్నారు. ప్రధాని మోదీ అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారని పవన్ తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల్లో ప్రధాని మోదీతో తన భేటీ జరిగిందని.. రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని నమ్ముతున్నానన్నారు. రాష్ట్రం బాగుండాలనేదే ప్రధాని మోదీ ఆకాంక్ష అని పవన్ స్పష్టం చేశారు.