మంచితనం, బలం ఉన్నవాళ్లు రాజకీయాల్లో రాణించలేకపోతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఎన్నికల ప్రచార సభకి హాజరయ్యారు. జనసేన తరఫున బలమైన అభ్యర్థులనే నిలబెట్టామన్నారు. రైతులకు సాయం చేయాలనే తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని పెట్టారనీ... సహకార పరిశ్రమను ప్రైవేటుపరం చేయడం సరికాదన్నారు. అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీని లాభాల బాట పట్టిస్తామని హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో 16 నదులున్నా నీటి సమస్యలు ఎందుకున్నాయని ప్రశ్నించారు. జనసేన వచ్చాక అనకాపల్లిని స్మార్ట్ సిటీని చేస్తామన్నారు. నియోజకవర్గంలో అవంతి శ్రీనివాస్ ఏ పనులూ చేయలేదనీ.. వైకాపా ప్రతిపక్ష పాత్రలో విఫలమైందని జనసేనాని ఉద్ఘాటించారు. జనసేన మద్దతుతోనే డ్రాక్రా సంఘాలకు రుణాలు వస్తున్నాయనీ.. తాము వస్తే వీటిని తీసేస్తారనడంలో వాస్తవం లేదని స్పష్టంచేశారు.
ప్రతిపక్ష పాత్రలో వైకాపా విఫలమైంది: పవన్‌కల్యాణ్
ప్రతిపక్ష పాత్రలో వైకాపా విఫలమైందని జనసేనాని ఆరోపించారు. నియోజకవర్గంలో అవంతి శ్రీనివాస్ ఏ పనులూ చేయలేదని.. ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
అనకాపల్లిలో జనసేనాని ప్రచారం