ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Pawan Kalyan Comments in Janavani Program: దివ్యాంగులను ఇబ్బంది పెట్టేవారిని శిక్షించే చట్టం రావాలి: పవన్​కల్యాణ్​ - janasena chief Pawan meeting with disabled persons

Pawan Kalyan Comments in Janavani Program: దివ్యాంగులను ఇబ్బంది పెట్టేవారిని శిక్షించే చట్టం రావాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. విశాఖలో జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తనను కలిసేందుకు వచ్చిన వారి సమస్యలను తెలుసుకున్నారు.

Pawan_Kalyan_Comments
Pawan_Kalyan_Comments

By

Published : Aug 17, 2023, 3:56 PM IST

Pawan Kalyan Comments in Janavani Program in Vizag: దివ్యాంగులను ఉన్నతమైన పరిపక్వతతో చూడాలని జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ అన్నారు. విశాఖలో జరిగిన జనవాణి కార్యక్రమంలో దివ్యాంగులతో ముచ్చటించిన పవన్​.. వారిని చూస్తే మనసు కలచివేస్తోందన్నారు. జనవాణి కార్యక్రమం చేసినప్పుడు దివ్యాంగుల సమస్యల గురించి చర్చిస్తామన్నారు. అంగవైకల్యంతో పుట్టిన పిల్లలను రోడ్డుపై, పట్టాలపై వదిలేస్తున్నారని.. ఇలా పుట్టాలని ఎవరూ కోరుకోరన్నారు. దివ్యాంగులకు రాష్ట్రంలో న్యాయం జరగడం లేదన్నారు. సర్టిఫికెట్​ లేని వారు అనేక మంది ఉంటున్నారని.. సర్టిఫికెట్​ ఉన్నా కొందరికి న్యాయం జరగడం లేదన్నారు. దివ్యాంగుల చట్టం అమలు కావడం లేదని.. వారిని ఇబ్బంది పెట్టే వారిని శిక్షించే చట్టం రావాలని పవన్​ డిమాండ్​ చేశారు. ప్రభుత్వం కూడా పింఛన్​ కింద మూడు వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటుందని విమర్శించారు.

Janavani Program in AP: ఆ చెల్లెలు ఆవేదనే జనవాణికి కారణం:పవన్​

"దివ్యాంగులను ఉన్నతమైన పరిపక్వతతో చూడాలి. దివ్యాంగుల చట్టం అమలు కావడం లేదు. దివ్యాంగులను ఇబ్బంది పెట్టేవారిని శిక్షించే చట్టం రావాలి. ప్రభుత్వం కూడా రూ. 3 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. మీతో మాట్లాడేటప్పుడు ఓటు అనే భావన లేదు. జనసేన ప్రభుత్వం ఏర్పాటైతే దివ్యాంగులను గుండెల్లో పెట్టుకుంటాను. ప్రభుత్వం మీ దగ్గరికి వచ్చేలా చేస్తాను. ఎన్డీయే మీటింగ్‌కి వెళ్లినప్పుడు మోదీతో మాట్లాడి న్యాయం చేస్తాను. అందరిని ఎడ్యుకేట్ చేసే బాధ్యత తీసుకుంటాను" -పవన్​కల్యాణ్​, జనసేన అధినేత

Pawan Kalyan Inspected Red Mud Dunes: 'ఎర్రమట్టి దిబ్బలు అరుదైన వారసత్వ సంపద... ఉత్తరాంధ్రలో ప్రకృతి విధ్వంసం ఆపాలి'

Pawan Janavani Program: దివ్యాంగులను ఎప్పూడూ తన కుటుంబ సభ్యులుగా చూస్తానని పవన్​ కల్యాణ్​ అన్నారు. సమాజంలో ఇలాంటి వారిని ఆదుకునే వారు ముందుకు రావాలని పవన్​ పిలుపునిచ్చారు. దివ్యాంగులతో మాట్లాడేటప్పుడు ఓటు అనే భావన రాదన్నారు. జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దివ్యాంగులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని జనసేనాని భరోసా ఇచ్చారు. ప్రభుత్వమే వాళ్ల దగ్గరికి వచ్చేలాగా చేస్తానని పేర్కొన్నారు. విదేశాల్లో దివ్యాంగులను అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేకంగా చూస్తాయని తెలిపారు. ఆత్మనూన్యత భావం ఉండకూడదనే తాను భావిస్తానన్నారు. ఎన్డీఏ మీటింగ్​కి వెళ్లినప్పుడు మోదీతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అందరినీ ఎడ్యుకేట్​ చేసే బాధ్యత తాను తీసుకుంటానని పవన్​ అన్నారు. దివ్యాంగుల హక్కుల కోసం పోరాటాలు, ఉద్యమాలు చేసే పని లేకుండా చేస్తానని.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు లోన్​లు ఇచ్చి ఆదుకుంటానని పవన్​ హమీ ఇచ్చారు. జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న పవన్‌ కల్యాణ్‌.. ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున బీమా చెక్కులను అందించారు.

Pawan Kalyan Fires on CM Jagan: జనసేన తరఫున ప్రజా కోర్టు కార్యక్రమం.. మొదటగా జగన్నే విచారిస్తాం: పవన్

Huge Crowd to Janavani Program: 'జనవాణి – జనసేన భరోసా' కార్యక్రమంలో సమస్యలు చెప్పుకొనేందుకు విశాఖ వాసులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. జనవాణి నిర్వహించే దసపల్లా హోటల్ వద్ద ఏర్పాటు చేసిన సమస్యల నమోదు, పరిశీలనకు ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద బారులు తీరారు. పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటూ, క్యూ లైన్లు, నమోదు ప్రక్రియ పరిశీలించారు. కార్యక్రమం సజావుగా సాగడానికి పలు సూచనలు చేశారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Pawan Kalyan Visited Vissannapeta Lands: వైసీపీకి ఉత్తరాంధ్ర ప్రజలపై కాదు.. భూములపై మాత్రమే ప్రేమ: పవన్

ABOUT THE AUTHOR

...view details