ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింహాద్రి అప్పన్న దేవాలయంలో నేటి నుంచి పవిత్రోత్సవాలు - విశాఖలో సింహాచలం దేవాలయం

సింహాద్రి అప్పన్న సన్నిధిలో నేటి నుండి పవిత్రోత్సవాలు జరగనున్నాయి. రాత్రి 7 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు.

Simhachalam
Simhachalam

By

Published : Aug 28, 2020, 3:48 PM IST

విశాఖ జిల్లా సింహాచలం.. సింహగిరిపై శుక్రవారం నుంచి ఐదు రోజులపాటు వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. రాత్రి 7 గంటలకు మృత్సంగ్రహణం, అంకురార్పణ, హోమాలతో పవిత్రోత్సవాలను ప్రారంభిస్తారు. 29వ తేదీన ఉదయం విశేష హోమాలు, పారాయణాలు, రాత్రి ఆదివాసములు, పారాయణాలు చేస్తారు.

30వ తేదీ ఉదయం విశేష హోమాలు, పారాయణాలు రాత్రి పవిత్ర సమర్పణ, 31న ఉదయం విశేష హోమాలు, పారాయణాలు, రాత్రి పూర్ణాహుతి, పవిత్ర విసర్జన, రథబలి నిర్వహిస్తారు. సెప్టెంబర్‌ 1వ తేదీ ఉదయం ఏకాంత స్నపనంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. ఈనెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 1 తేదీ వరకు ఆర్జిత సేవలు రద్దుచేసినట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details