ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పసుపు-కుంకుమ ప్రతి ఏడాది అమలు చేస్తాం' - vishaka

అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం పసుపు-కుంకుమ పథకాన్ని అమలు చేస్తామని విశాఖ జిల్లా నర్సీపట్నం తెదేపా అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యకర్తలతో కలిసి నియోజకవర్గంలో ఆయన ప్రచారం నిర్వహించారు.

చింతకాయల అయ్యన్నపాత్రుడు  ఎన్నికల ప్రచారం

By

Published : Apr 2, 2019, 6:05 PM IST

చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎన్నికల ప్రచారం
విశాఖ జిల్లా నర్సీపట్నంలో తెదేపా అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాతవరం మండలంలో విస్తృతంగా పర్యటించి ఓట్లను అభ్యర్థించారు. తెదేపా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అధికారంలోకి వస్తే పసుపు-కుంకుమ పథకాన్ని అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని ప్రజలను కోరారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details