ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ రైల్వే స్టేషన్​లో ప్రయాణికుల పాట్లు - officers

వేసవి రద్దీ, రంజాన్ సందర్భంగా విశాఖ రైల్వేస్టేషన్​లో ప్రయాణికుల రద్దీ పెరిగింది.  వారికి అనుగుణంగా ప్రత్యేక సర్వీసులు నడపాల్సిన రైల్వే అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

ప్రయాణికులు

By

Published : Jun 7, 2019, 7:03 AM IST

వేసవి రద్దీ, రంజాన్ పర్వదినాల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సిన రైల్వే అధికారులు ఆ దిశగా ఆలోచించటం లేదు. ప్రయాణికులకు మాత్రం పాట్లు తప్పటం లేదు. ప్రత్యేక రైళ్ల సంగతి మాట పక్కన పెడితే... రోజువారీగా నడిచే రైళ్లలోని జనరల్ బోగీల్లో కోత విధించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విశాఖపట్నం నుంచి కోర్బా వెళ్లాల్సిన లింక్ ఎక్స్ ప్రెస్ రైల్లో ఒక సాధారణ బోగీని తగ్గించడంతో ప్రయాణికులు నిత్యం తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. నిర్వహణ పనుల కారణంగా రైలు దాదాపు గంటన్నర ఆలస్యంగా స్టేషన్ కు చేరుకోవడంతో స్టేషన్లోనే ప్రయాణికులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎనిమిది గంటలకు విశాఖ నుంచి బయల్దేరాల్సిన రైలు రాత్రి 9 గంటలకు ఫ్లాట్​ఫాం పైకి వచ్చింది. రైల్లో సీటుకోసం ప్రయాణికులు పెద్ద యుద్ధాలే చేయాల్సి వస్తోంది. ఈరైల్లో వందలాది మంది సాధారణ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రైల్వే అధికారులు ఏర్పాటు చేసిన మూడు జనరల్ బోగీలు ఏమాత్రం సరిపోవటం లేదు. చాలా మంది ప్రయాణికులు రైలు ఎక్కలేక స్టేషన్లోనే ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.

రైలు ప్రయాణికుల రద్దీ

ABOUT THE AUTHOR

...view details