విశాఖపట్నం జిల్లా ఎస్. రాయవరం(S.rayavaram)లో వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీలో గందరగోళం నెలకొంది. ఈ కార్యక్రమంలో కొత్తగా పార్టీలోకి చేరిన నాయకులను వేదికపై ఆహ్వానించి, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారిని విస్మరించారని పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బాబురావుతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనతో సభాస్థలిలో స్వల్ప వివాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
MLA Baburao: ఎమ్మెల్యే బాబురావుతో కార్యకర్తల వాగ్వాదం...ఎందుకంటే..! - payakaraopeta MLA baburao
పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావు(MLA baburao)కు సొంత పార్టీ కార్యకర్తల నుంచే ప్రతిఘటన ఎదురైంది. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతుంటే.. కొత్తగా వచ్చినవారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. దీంతో స్వల్ప వివాదం చెలరేగింది.. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
ఎమ్మెల్యేతో సొంత పార్టీ కార్యకర్తల వాగ్వాదం