విశాఖ జిల్లా పాడేరు జూనియర్ కళాశాలలో పదహారు వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ఏడో వార్డులో పోలింగ్ ముద్రవేసే బాక్స్ స్టాండ్.. పక్కన వైకాపా రంగులు కనబడటంతో కొంత మంది ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత పోలింగ్ అధికారిని ప్రశ్నించగా.. ట్యూబ్‌లైట్ కవర్లను ఇలా వినియోగించామని చెప్పారు. యాదృచ్ఛికంగా జరిగిందని తెలిపారు. వాటిని తొలగించారు. మరోపక్క 11వ వార్డులో ఓ వ్యక్తి చాలాసేపు పోలింగ్ బూత్‌లో ఉండటంతో అతడిని వెంటనే బయటికి పంపించాలని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. పోలీసులు సదరు వ్యక్తిని బయటకు పంపించారు.
ఇదేం పని.. పోలింగ్ బూత్‌లో పార్టీ రంగులా?!
విశాఖ జిల్లా పాడేరు ఓటింగ్ కేంద్రంలో పార్టీ రంగులు కలిగిన స్టాండ్ ఉండడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. ఇదేంటీ పార్టీ రంగులు అంటూ పలువురు ప్రశ్నించారు. ఈ విషయం మీడియా దృష్టికి రావడంతో స్టాండ్‌ను తొలగించారు.
ఇదేం పని.. పోలింగ్ బూత్‌లో పార్టీ రంగులా?!